ఔషధాలపై 100% సుంకం

ఔషధాలపై 100% సుంకం
X
భారతీయ ఉత్పత్తులపై అదనంగా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన సుంకాల డోస్ ను పెంచారు. ఆరోగ్యరంగానికి కీలకమైన ఫార్మ

వాషింగ్టన్ : భారతీయ ఉత్పత్తులపై అదనంగా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన సుంకాల డోస్ ను పెంచారు. ఆరోగ్యరంగానికి కీలకమైన ఫార్మస్యూటికల్స్ పై ఏకంగా 100 శా తం , కిచెన్ కేబినెట్ లు, బాత్ రూమ్ సామగ్రిపై 50 శాతం, సోఫాలు, కుర్చీల వంటి పరికరాలపై 30శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. అక్టోబర్ 1 నుం చి ఈ అదనపు బాదుడు అమలులోకి వస్తుంది. గురువారం ట్రంప్ సోషల్ మీడియా వేదికలో చేసిన పోస్ట్ ల ప్రకారం ట్రంప్ ఆగస్టులో ప్రారంభించిన వాణిజ్య, ది గుమతి పన్నులతో సంతృప్తి చెందలేదని స్పష్టమైంది. అ మెరికాలో ఆయా ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించ డం ద్వారా ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడానికి ఈ అదనపు సుంకాల ద్వారా వచ్చే మొత్తం తోడ్పడుతుందని ట్రంప్ భావిస్తున్నట్లు


వ్యక్తమైంది. అమెరికాలో ఔషధాల తయారీ ప్లాంట్లను నిర్మిస్తున్న కంపెనీలకు ఫార్మస్యూటికల్స్ సుంకాలు వర్తించవని, అలాగే నిర్మాణాలలో ఉన్న కంపెనీలు, ప్రారంభోత్సవానికి సిద్ధమైన కంపెనీలకు వర్తించబోవని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పటికే కర్మాగారాలు ఉన్న కంపెనీలకు ఈ సుంకాలు వర్తిస్తాయా లేదా అన్నది స్పష్టం కాలేదు. 2024లో అమెరికా దాదాపు 233 బిలియ న్ల ఔషధాలు, ఔషధ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు సె న్సస్ బ్యూరో తెలిపింది. కొన్ని ఔషధాల ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, మెడికేర్, మెడికైడ్ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఔషధాల ధరలు తక్షణం పెరుగుదల, ఇప్పటికే దెబ్బతిన్న బీమా కంపెనీలు, ఆసుపత్రుల కొరత కారణంగా రో గులు అత్యవసర మందులను మాని వేసే ప్రమాదం ఉందని, అందువల్ల సుంకాల పెంపు అమెరికన్ల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చునని కెనడియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ పాస్కల్ చాన్ తన స్పందనలో తెలిపారు. అమెరికాలో ఇళ్ల కొరత, మార్టిగేజ్ వడ్డి రేట్ల పెరుగుతల కారణంగా కొత్తగా ఇల్లుకొనాలనుకునే చాలా మందికి కిచెన్ క్యాబినెట్ పై కొత్త సుంకాలు అధిక భారం కావచ్చు. ఇప్పటికే ఇంటి సగటుధర 4,32,600 డాలర్ల మేరకు ఉంది.

విదేశాలనుంచి దిగుమతి అవుతున్న భారీ ట్రక్కులు, విడిభాగాలు దేశీయ ఉత్పత్తిదారులను దారుణంగా దెబ్బతీస్తున్నాయని, వారిని రక్షించేందుకే ఆ ట్రక్కులపై 25 శాతం సుంకం పెంచినట్లు ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. దేశవాళీ ఫ్యాక్టరీలలో కంపెనీలు ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు అదనపు సుంకాలు కీలకమని ట్రంప్ చాలా కాలంగా వాదిస్తున్నారు.దిగుమతి దారులు పన్నుల ఖర్చులో అధిక భాగాన్ని ధరలు పెంచడం ద్వారా వినియోగదారులు, వ్యాపారులపై మోపుతారనే భయాలని కొట్టివేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం అమెరికా ఆర్థికవ్యవస్థకు సవాల్ కాదని ట్రంప్ పేర్కొంటున్నారు.



Tags

Next Story