తాటికుంట రిజర్వాయర్ లో గల్లంతైన మృత దేహాలు లభ్యం

Thatikunta Reservoir Bodies found
X

Thatikunta Reservoir Bodies found

మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా తాటికుంట రిజర్వాయర్ లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం దంపతులు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భార్య నీటిలో పడిపోయింది. భార్యను రక్షించబోయి భర్త అందులో దూకడంతో ఇరువురు గల్లంతయ్యారు. ఈ ఘటన మల్దకల్ మండలం తాటికుంట రిజర్వాయర్ లో జరిగింది. వారి అచూకి కోసం బుధవారం నుండి గాలించగా.. గురువారం జలాశయంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. దంపతుల మృతదేహాలు స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను […]

మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా తాటికుంట రిజర్వాయర్ లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం దంపతులు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భార్య నీటిలో పడిపోయింది. భార్యను రక్షించబోయి భర్త అందులో దూకడంతో ఇరువురు గల్లంతయ్యారు. ఈ ఘటన మల్దకల్ మండలం తాటికుంట రిజర్వాయర్ లో జరిగింది. వారి అచూకి కోసం బుధవారం నుండి గాలించగా.. గురువారం జలాశయంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. దంపతుల మృతదేహాలు స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతులు భర్త రాముడు( 40),భార్య సంధ్య (36)గా గుర్తించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాముడు జలాశయంలో చేపలవేట సాగించి కుటుంబాన్ని పోషించేవాడు.

Also Read : ఎస్‌ఎల్‌బిసిపై వెనుకడుగు లేదు

Tags

Next Story