అనంతగిరి ఘాట్ రోడ్డు లో ట్రావెల్ బస్సు బోల్తా

X
హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో అనంతగిరి ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. నలుగురు మృతి చెందగా.. గాయపడిన 51మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. యాచారం నుంచి బానూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ట్రావెల్ బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
