కంటైనర్ ను ఢీకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి

travel bus hit container lorry
X

travel bus hit container lorry

కొత్తకోట గ్రామీణం: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున అడ్డాకుల మండలం కాటావరం స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుకనుంచి ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని […]

కొత్తకోట గ్రామీణం: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున అడ్డాకుల మండలం కాటావరం స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుకనుంచి ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులను అష్రస్ ఉన్నిసా (70), హసన్ (35), ఎల్లమ్మ (45) గా పోలీసులు గుర్తించారు.

Also Read : శత్రుత్వం వద్దు..డ్రాగన్‌-ఏనుగు ఏకమవ్వాలి

Tags

Next Story