కాంట్రాక్టర్ ఆత్మహత్య.... మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటిపై దాడి

Yellandu Former Municipal Chairman
X

Yellandu Former Municipal Chairman

భద్రాద్రి కొత్తగూడెం: మాజీ మున్సిపల్ చైర్మన్, కాంట్రాక్టర్ మధ్య గొడవ జరిగింది. కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు చౌదరి, ఇల్లందు ప్రముఖ కాంట్రాక్టర్ గడపర్తి శ్రీనివాస్ చౌదరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఖమ్మంలో ఇద్దరికీ పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. Also Read: చిన్న దేశం.. గొప్ప సందేశం శుక్రవారం రాత్రి మనోవేదనకు […]

భద్రాద్రి కొత్తగూడెం: మాజీ మున్సిపల్ చైర్మన్, కాంట్రాక్టర్ మధ్య గొడవ జరిగింది. కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు చౌదరి, ఇల్లందు ప్రముఖ కాంట్రాక్టర్ గడపర్తి శ్రీనివాస్ చౌదరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఖమ్మంలో ఇద్దరికీ పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది.

Also Read: చిన్న దేశం.. గొప్ప సందేశం

శుక్రవారం రాత్రి మనోవేదనకు గురైన గడపర్తి శ్రీను కారేపల్లి మండలం మొట్లగూడెం గ్రామానికి చేరుకొని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చౌదరి ఇంటిపై శ్రీనివాస్ బంధువులు దాడి చేశారు. మృతదేహాన్ని తీసుకువెళ్లి దమ్మలపాటి వెంకటేశ్వర రావు ఇంటి ముందు ఉంచడంతో ఆందోళన దిగారు. మృతుడి బంధువులు వెంకటేశ్వరరావు కారు అద్దాలు, ఇంటి అద్దాలను పగలగొట్టారు. చనిపోయిన శ్రీనివాస్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుకు బావమరిది అవుతాడు.

Tags

Next Story